ముంబై: ఆన్‌లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘బిగ్ షాపింగ్ డేస్’ పేరుతో లాంచ్ చేసిన స్పెషల్ సేల్ ద్వారా ఒప్పో, శాంసంగ్ రియల్‌మి తదితర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 19 నుంచి 22 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను దాదాపు 50 వేల తగ్గింపుతో అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కొనుగోలుపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభ్యం. మూడు రంగుల్లో ఇది లభిస్తోంది. అలాగే 12100 దాకా ఎక్స్జేంజ్ ఆఫర్ కూడా వుంది.
రూ.70 వేల శాంసంగ్ ఫోన్ రూ. 25 వేలకే